Skip to main content

Bible Quiz Questions and Answers From Exodus

 Exodus Quiz: Bible Quiz Questions and Answers From the Book of Exodus

130 Bible Quiz Questions and Answers​ From the Book of Exodus (Part-6)

exodus bible quiz exodus quiz exodus bible quiz questions and answers pdf bible quiz on exodus with answers pdf exodus quiz questions and answers bible quiz on exodus with answers bible quiz questions and answers from the book of exodus exodus bible bowl questions pdf quiz questions from the book of exodus exodus bible quiz questions and answers bible quiz on the book of exodus quiz questions on the book of exodus exodus bible trivia exodus trivia questions exodus summary quiz quiz questions on the book of exodus pdf bible quiz questions and answers from exodus pdf exodus quiz pdf exodus quiz questions bible quiz questions from exodus exodus bible questions
Bible Quiz Questions and Answers From Exodus



1/130
అహరోను ......... ప్రొద్దున దానిమీద పరిమళద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్క పరచునప్పుడు దానిమీద ఆ ధూపము వేయవలెను.?
A. ప్రతిదినము
B. ప్రతిసబ్బాతుదినము
C. ప్రతిసంవత్సరం
D. ప్రతిఅమావాస్య
2/130
మరియు .......... . అహరోను ప్రదీపములను వెలిగించునప్పుడు దానిమీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము.?
A. వేకువనే
B. మద్యాన్లమందు
C. ఉదయమున
D. సాయంకాలమందు
3/130
మీరు దానిమీద ......ధూపమునైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు; పానీ యమునైనను దానిమీద పోయకూడదు.?
A. కన్య
B. అపవిత్ర
C. అన్య
D. ఇతర
4/130
మరియు అహరోను సంవత్సరమున ఎన్నిసార్లు ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్ధబలి రక్తమువలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది.?
A. కొకసారి
B. ప్రతినెల
C. రెండు
D. అంతమున
5/130
వారు లెక్కింప బడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన .............. ధనము నిచ్చుకొనవలెను. ఆలాగు చేసినయెడల నీవు వారిని లెక్కించునప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు.?
A. ఆస్తిపరిక్రయ
B. ఆరోగ్యపరిక్రయ
C. ప్రాణపరిక్రయ
D. పొలముపరిక్రయ
6/130
వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధస్థలము యొక్క తులమునుబట్టి ........... ఇయ్యవలెను. ఆ తులము యిరువది చిన్నములు. ఆ ........ యెహోవాకు ప్రతిష్ఠార్పణ.?
A. తులము
B. ఏడుతులముల
C. అరతులము
D. పైవేవి కావు
7/130
ఇరువది సంవత్సరములు గాని అంతకంటె యెక్కువ వయస్సు గాని గలవారై లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును యెహోవాకు ...... నియ్యవలెను. ?
A. అర్పణ
B. సమయం
C. బలి
D. బంగారం
8/130
అది మీ ప్రాణములకు పరిక్రయధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చునప్పుడు ధనవంతుడు అర తులముకంటె ........ ఇయ్యకూడదు. బీదవాడు .......... ఇయ్య కూడదు. ?
A. మానము, తక్కువ
B. తక్కువ, ఎక్కువ
C. ఎక్కువ, సమానము
D. ఎక్కువ, తక్కువ
9/130
అవి అతిపరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని ... ప్రతివస్తువు ప్రతిష్ఠితమగును.?
A. చేయు
B. పట్టు
C. తగులు
D. ముట్టు
10/130
నీవు చేయవలసిన ఆ ధూపద్రవ్యమును దాని మేళనము చొప్పున...,.. నిమిత్తము మీరు చేసికొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను.?
A. నా
B. ప్రజల
C. మీ
D. రాజు
11/130
చూడుము; నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన .......... అను పేరుగల వానిని పిలిచితిని.?
A ఏలియాజరు
B. బసలేలు
C. బెసలేలు
D. అహరోను
12/130
........... పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై.?
A. చేతిముట్టు
B. విచిత్రమైన
C. అందమైన
D. యాజక
13/130
.......లను సాన బెట్టుటకును కఱ్ఱనుకోసి చెక్కుటకును.?
A. వైడుర్యము
B. ముత్యము
C. వజ్రము
D. రత్నము
14/130
సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞానవిద్యా వివేకములును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని ......... . పూర్ణునిగా చేసి యున్నాను.?
A. దేవుని ఆత్మ
B. దేవుని మనస్సు
C. దేవతల ఆత్మ
D. జ్ఞానము
15/130
మరియు నేను దాను గోత్రములోని అహీ సామాకు కుమారుడైన ...........ను అతనికి తోడు చేసితిని. నేను నీకాజ్ఞాపించినవన్నియు చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి యున్నాను.?
A. అహల్య
B. ఆసాను
C. ఆమోసును
D. అహోలీయాబు
16/130
అభిషేక తైలమును పరిశుద్ధ స్థలముకొరకు పరిమళ ధూపద్రవ్యములను నేను నీ ............. ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను.?
A. సెలవివ్వని
B. ఆజ్ఞాపించని
C. కాజ్ఞాపించిన
D. చూపించు
17/130
మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన ........ దినములను ఆచరింపవలెను;?
A. విశ్రాంతి
B. పండుగ
C. నియామక
D. సూచించిన
18/130
మిమ్మును .................. యెహోవాను నేనే అని తెలిసికొనునట్లు అది మీ తర తరములకు నాకును మీకును గురుతగును.?
A. చూచుచున్న
B. పరిశుద్ధపరచు
C. పిలచిన
D. పైవేవి కావు
19/130
కావున మీరు విశ్రాంతిదినము నాచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము; దానిని అపవిత్ర పరచువాడు తన ప్రజల లోనుండి ..........?
A.తృణీకరింపబడును
B. చంపబడును
C. నరకబడును
D. కొట్టివేయబడును
20/130
ఆరు దినములు పనిచేయ వచ్చును; ఏడవదినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతిదినము. ఆ విశ్రాంతిదినమున పనిచేయు ప్రతివాడును తప్పక ........ నొందును. ?
A. కొచ్చబడును
B. శిక్ష
C. తీర్పు
D. మరణశిక్ష
21/130
ఇశ్రాయేలీయులు తమ తర తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలెను; అది ......?
A. నిబంధన
B. కట్టడ
C. నిత్యనిబంధన
D.. నిత్యమైన
22/130
మరియు ఆయన సీనాయి కొండమీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసన ములుగల రెండు పలకలను, అనగా దేవుని ............ వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను.?
A. ఆజల
B. వ్రేలితో
C. ప్రజలకు
D. శాసనము
23/130
నేను నీకు ముందుగా ........ పంపి కనానీ యులను అమోరీయులను హితీయులను పెరిజీయులను హిప్పీయులను యెబూసీయులను వెళ్లగొట్టెదను. ?
A. దూతను
B. దేవతను
C. విగ్రహమును
D. మందసము
24/130
మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడ ........; త్రోవలో మిమ్మును సంహరించెద నామో అని మోషేతో చెప్పెను. ?
A. ఉండను
B. రాను
C. వెల్లను
D. తిరుగను
25/130
ప్రజలు ఆ దుర్వార్తను విని .........; ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు.?
A. ఆనందించిరి
B. నాట్యమాడిరి
C. దుఃఖించిరి
D. దూశించిరి
26/130
ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా, మిమ్మును. ............ చేసెదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియు నట్లు మీ ఆభరణములను మీ మీదనుండి తీసివేయుడి అని చెప్పుమనెను. ?
A శపించెదను
B. దీవించెదను
C. నాశనం
D. నిర్మూలము
27/130
కాబట్టి ఇశ్రాయేలీయులు ఎక్కడ కొండయొద్ద తమ ఆభరణములను తీసివేసిరి.?
A. హోరేబు
B. సినాయి
C. ఒలీవ
D. గొల్గత
28/130
మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు. ....... దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాటలాడుచుండెను. ?
A. సంబము
B. మేఘస్తంభము
C. మేఘము
D. ఆవిరి
29/130
మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ....... మాటలాడుచుండెను.
A. నెమ్మదిగా
B. ముఖాముఖిగా
C. చల్లగా
D. బలముగ
30/130
కాబట్టి ------నాయెడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలిసికొందును; చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలేగదా అనెను.?
A. నీ కనికరము
B. నీ కటాక్షము
C. నీ ప్రేమ
D. పైవేవి కావు
31/130
అందుకు ఆయననా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదననగా, రిఫరెన్స్. ?
A నిర్గమకాండము 33: 19
B. నిర్గమకాండము 33: 18
C. నిర్గమకాండము 33: 14
D. నిర్గమకాండము 33: 13
32/130
మోషే నీ సన్నిధి రానియెడల ఇక్కడనుండి మమ్మును ........ పోకుము. ?
A. చూడకనే
B. తోడుకొని
C. విడచి
D. మరువక
33/130
అతడు దయచేసి నీ ...... నాకు చూపుమనగా?
A ముఖమును
B. దయను
C. జాలిని
D. మహిమను
34/130
మరియు ఆయననీవు నా ....... చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడనెను.?
A. ముఖమును
B. వెలుగును
C. మహిమను
D. ప్రబావమును
35/130
మాషే కొండదిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చిలెమ్ము, మా ముందర నడుచుటకు ఒక ....... మాకొరకు చేయుము.?
A. ఆవును
B. దేవతను
C. విగ్రహమును
D. దూడను
36/130
అందుకు అహరోనుమీ భార్యలకు మీ కుమా రులకు మీ కుమార్తెలకు చెవుల నున్న ........ పోగులను తీసి నాయొద్దకు తెండని వారితో చెప్పగా. ?
A. ఇతడి
B. వెండి
C. రాగి
D. బంగారు
37/130
అతడు వారియొద్ద వాటిని తీసికొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన ....... ఇదే అనిరి.?
A. నీ దేవుడు
B. నా దేవుడు
C. నీ దేవత
D. నా దేవత
38/130
అహరోను అది చూచి దాని యెదుట ఒక ......... కట్టించెను. మరియు అహరోనురేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా.?
A. పీఠము
B. స్వరూపం
C. బలిపీఠము
D. మందసము
39/130
మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధానబలులు నర్పించిరి. అప్పుడు జనులు ........ త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి.?
A. కూడుటకు
B. నాట్యమాడుటకు
C. తినుటకును
D. అర్పించుటకు
40/130
కాగా యెహోవా మోషేతో ఇట్లనెనునీవు దిగి వెళ్లుము; ఐగుప్తుదేశమునుండి నీవు రప్పించిన నీ ప్రజలు.?
A. నశించిరి
B. చదిరిపోయిరి
C. దూశించిరి
D. చెడిపోయిరి
41/130
మరియు యెహోవా ఇట్లనెనునేను ఈ ప్రజలను చూచియున్నాను; ఇదిగో వారు ....... ప్రజలు.?
A. లోబడే
B. లోబడనొల్లని
C. మారాముచేసె
D. బలముగల
42/130
కావున నీవు ఊరకుండుము; నా ....... వారిమీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసెదనని మోషేతో చెప్పగా.?
A. కోపము
B. కనికరము
C. ప్రేమ
D. పైవేవి కావు
43/130
నీ కోపాగ్నినుండి మళ్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడుచేయక దానిగూర్చి ......?
A. తృణీకరింపుము
B. సేదదీర్చుము
C. సంతాపపడుము
D. చింతించకుము
44/130
మోషే ..........గల రెండు పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి; అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయ బడియుండెను.?
A. మాటలు
B. ఆజలు
C. పాటలు
D. శాసనములు
45/130
ఆ పలకలు ....... చేసినవి; ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత ........ చేవ్రాత.?
A. దూత
B. మోషే
C. దేవుడు
D. అహరోను
46/130
అందుకు మోషే పాళెముయొక్క ద్వార మున నిలిచి ........ పక్షమున నున్న వారందరు నాయొద్దకు రండి అనగా లేవీయులందరును అతని యొద్దకు కూడి వచ్చిరి. ?
A. యెహోవా
B. దేవుని
C. దూతల
D. ప్రజల
47/130
యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి ....... రాతిపలకలను చెక్కుము. నీవు పగుల గొట్టిన మొదటి పలకలమీదనున్న వాక్యములను నేను ఈ పలకలమీద వ్రాసెదను. ?
A. బంగారు
B. ఒక
C. రెండు
D. మూడు
48/130
ఉదయము నకు నీవు ....... ఉదయమున సీనాయి కొండయెక్కి అక్కడ శిఖరము మీద నా........... నిలిచియుండవలెను.?
A. సిద్ధపడి, ముందర
B. సరిపడి, సన్నిధిని
C. సిద్ధపడి, సన్నిధిని
D. సరిచేసి, సన్నిధిని
49/130
..........నీతో ఈ కొండకు రాకూడదు; ఈ కొండ మీద ఎక్కడనైనను కనబడకూడదు; ఈ కొండయెదుట గొట్టెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను.?
A. ఏ స్త్రీ
B. ఏ పురుషుడు
C. ఏ పశువును
D. ఏ నరుడును
50/130
మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో ...... యెహోవా అను నామమును ప్రకటించెను.?
A. నిలిచి
B. నడిచి
C. మాట్లాడి
D. తర్కించి
51/130
యెహోవా అతని దాటి వెళ్లుచుయెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా. రిఫరెన్స్. ?
A. నిర్గమకాండము 34: 7
B. నిర్గమకాండము 34: 6
C. నిర్గమకాండము 34: 9
D. నిర్గమకాండము 34: 10
52/130
ఆయన వేయి వేలమందికి .......... చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును?
A. న్యాయము
B. కనికరము
C. తీర్పు
D. కృపను
53/130
అందుకు మోషే త్వరపడి నేలవరకు తలవంచుకొని ........... చాసీ.?
A. వందనం
B. నమస్కారము
C. పూజించి
D. సాగిల
54/130
నీవు ఎక్కడికి వెళ్లుచున్నావో ఆ దేశపు నివాసులతో .. చేసికొనకుండ జాగ్రత్తపడుము. ఒకవేళ అది నీకు ఉరికావచ్చును.?
A. కట్టడ
B. నిబంధన
C. ప్రమాణము
D. పైవేవి కావు
55/130
కాబట్టి మీరు వారి ...... పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను.?
A. స్థంబములను
B. మందిరములు
C. విగ్రహాలను
D. బలిపీఠములను
56/130
ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము ......... యెహోవా; ఆయన రోషముగల దేవుడు.?
A. దయగల
B. ప్రేమగల
C. రోషముగల
D. కనికరముగల
57/130
అతడు నలుబది రేయింబగళ్లు యెహోవాతో కూడ అక్కడ నుండెను. అతడు ................. చేయలేదు .............త్రాగలేదు; అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకలమీద వ్రాసెను.?
A. భోజనము, నిద్ర
B. భోజనము, నీళ్లు
C. నిద్ర, నీళ్లు
D. భోజనము, ద్రాక్షారసము
58/130
మోషే ముఖచర్మము ......... ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి; మోషే ఆయనతో మాటలాడుటకు లోపలికి వెళ్లువరకు తన ముఖముమీద ముసుకు వేసికొనెను.?
A. దాచగా
B. ప్రకాశింపగా
C. చూపగా
D. పైవేవికావు
59/130
బెసలేలును అహోలీ యాబును యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెనో వారి నందరిని ఎవరు పిలిపించెను?
A. దేవుడు
B. యెహోవా
C.మోషే
D. అహరోను
60/130
అయినను ఇశ్రాయేలీయులు ఇంక ప్రతి ఉదయమున ....... అర్పణములను అతని యొద్దకు తెచ్చు చుండిరి.?
A. మనఃపూర్వకముగా
B. ఆలోచన చెప్పున
C. బలవంతముగా
D. ప్రేరేపణ చొప్పున
61/130
అప్పుడు పరిశుద్ధస్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు ....... విడిచివచ్చి.?
A. కుటుంబము
B. బలి
C. గోత్రము
D. పని
62/130
మోషేతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవకొరకు ప్రజలు కావలసిన దానికంటే ఏవిధంగా తీసికొని వచ్చుచున్నారని చెప్పగా.?
A. బహు తక్కువగా
B. బహు విస్తారము
C. మిక్కిలి
D. కొద్దిగా
63/130
మరియు మందిరముమీద ....... మేకవెండ్రుకలతో తెరలను చేసెను; వాటిని పదకొండు తెరలనుగా చేసెను.?
A. గుడారముగా
B. కప్పుగా
C. తెరగా
D. వస్త్రముగా
64/130
ఏ వైపున, అనగా దక్షిణ దిక్కున ఇరువది పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను.?
A. యడమ
B. కుడి
C. ముందు
D. వెనుక
65/130
ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకఱ్ఱలుండు వాటి ఉంగరములను దేనితో చేసి అడ్డ కఱ్ఱలకు బంగారు రేకులను పొదిగించెను?
A. రాగి
B. యిత్తడి
C. వెండి
D. బంగారు
66/130
మరియు అతడు నీల ధూమ్ర రక్తవర్ణములుగల అడ్డతెరను పేనిన దేనితో చేసెను, చిత్రకారునిపనియైన కెరూబులుగలదానిగా దాని చేసెను.?
A. నారతో
B. సన్ననార
C. దొడ్డునార
D. పైవేవి కావు
67/130
దాని కొరకు తుమ్మకఱ్ఱతో నాలుగు ...... లనుచేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను.?
A. స్తంభము
B. ద్వీపము
C. భుజము
D. ప్రదీపము
68/130
మరియు అతడు గుడారపు ద్వారముకొరకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో ఏ పనియైన అడ్డ తెరను చేసెను.?
A. బుటా
B. బాటా
C. ప్రగ్న
D. బాకా
69/130
దాని అయిదు స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోదెలకును వాటి పెండె బద్దలకును బంగారు రేకులను పొదిగించెను; వాటి అయిదు దిమ్మలు.......?
A. బంగారువి
B. యితడివి
C. ఇత్తడివి
D. రాగివి
70/130
ఏ స్థలముయొక్క సేవనిమిత్తము ప్రతివిధమైన పనిచేయ తెలిసికొనుటకై యెహోవా.?
A. పరిశుద్ధ
B. పరలోక
C. నీతి
D. పైవేవికావు
71/130
ఆరు దినములు పనిచేయవలెను; ఏడవది మీకు .........దినము. అది యెహోవా విశ్రాంతిదినము; దానిలో పనిచేయు ప్రతివాడును మరణ శిక్షనొందును.?
A. మోదటి
B. ప్రత్యేక
C. ముఖ్య
D. పరిశుద్ధ
72/130
విశ్రాంతి దినమున మీరు మీ యిండ్లలో ఎక్కడను ...... రాజబెట్ట కూడదని వారితో చెప్పెను.?
A. అగ్ని
B. మంట
C. పొర
D. ద్వని
73/130
మీరు మీలోనుండి యెహోవాకు ..........పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధిపుట్టిన ప్రతివాడు యెహోవా సేవనిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి,?
A. దహనము
B. ప్రాణము
C. అర్పణము
D. బలి
74/130
ప్రదీపమునకు .......?
A. నూనె
B. తైలము
C. అభిషేకము
D. అగ్ని
75/130
మరియు. .......... హృదయులందరు వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నియు చేయవలెను.?
A. జాన
B. అజ్ఞాన
C. వివేక
D. అవివేక
76/130
తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరు వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క ......కొరకును దాని సమస్త ......కొరకును ప్రతిష్ఠిత .......కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి.?
A. పని, సేవ, ద్వీపముల
B. బలి, సేవ, వస్త్రముల
C. పని, బలి, వస్త్రముల
D. పని, సేవ, వస్త్రముల
77/130
......గాని ......గాని ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకఱ్ఱ యెవని యొద్దనుండెనో వాడు దాని తెచ్చెను.?
A. రాగి, యిత్తడి
B. వెండి, యిత్తడి
C. వెండి, బంగారు
D. బంగారు, యిత్తడి
78/130
మరియు వివేక హృదయముగల . ......... తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలును సన్ననార నూలును తెచ్చిరి.?
A. స్త్రీలందరు
B. పురుశులందరు
C. నరులందరు
D. గొర్రెలందరు
79/130
ఏ స్త్రీలు జ్ఞానహృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరు...... వెండ్రుకలనువడికిరి.?
A. గొర్రె
B. ఒంటె
C. మేక
D. గాడిద
80/130
విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ........ కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియున్నాడు.?
A. పజ్ఞా వివేక జ్ఞానములు
B. ప్రజ్ఞా అవివేక జ్ఞానములు
C. ప్రజ్ఞా వివేక అజ్ఞానములు
D. ప్రజ్ఞా వివేక జ్ఞానములు
81/130
యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన ....... పేరుపెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును,?
A. అహరోను
B. బెసలేలును
C. మోషే
D. యెహోషువా
82/130
ఏ పని యైనను చేయువారియొక్కయు విచిత్రమైన పని కల్పించు వారియొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను ...... నింపియున్నాడు.?
A. జ్ఞానముతో
B. బుద్దితో
C. వివేకముతో
D. పైవేవికావు
83/130
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధస్థలములో అహరోను చేయు సేవనిమిత్తము నీల ధూమ్ర రక్తవర్ణములుగల సేవావస్త్రములను అనగా ..... వస్త్రములను కుట్టిరి.?
A. రంగుల
B. ప్రతిష్ఠిత
C. అభిషేక
D. బలిపీఠ
84/130
మరియు అతడు బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములుగల నూలుతోను పేనిన సన్ననారతోను. ....... చేసెను.?
A. రేకును
B. ఓఫోదును
C. జల్లెడను
D. ఏఫోదును
85/130
దానికి కూర్చు ....... చేసిరి, దాని రెండు అంచులయందు అవి కూర్పబడెను.?
A. ఖండములను
B. హసఖండములను
C. భుజఖండములను
D. దేహఖండములను
86/130
మరియు బంగారు జవలలో పొదిగిన .......... సిద్ధ పరచిరి. ముద్రలు చెక్కబడునట్లు ఇశ్రాయేలీయుల పేళ్లు వాటిమీద చెక్కబడెను.?
A. గట్టిపచ్చలను
B. సింహాసనం
C. లేతపచ్చలను
D. పచ్చలను
87/130
అవి ఇశ్రాయేలీయులకు......... రత్నములగునట్లు ఏఫోదు భుజములమీద వాటిని ఉంచెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.?
A. జ్ఞాపకారమైన
B. అజ్ఞాపకార్థమైన
C. మరచబడిన
D. మరువబడు
88/130
వారు దానిలో నాలుగు పంక్తుల రత్నములను పొదిగిరి. ...... గోమేధిక మరకతములు గల పంక్తి మొదటిది; ?
A. వైడూర్య
B. వజ్రాల
C. మాణిక్య
D. రాల్ల
89/130
పద్మరాగ నీల ........ మణులుగల పంక్తి రెండవది; ?
A. కాంతిగల
B. చంద్రకాంత
C. వలుగుగల
D. సూర్యకాంత
90/130
ఆ రత్నములు ఇశ్రాయేలీ యుల పేళ్ల చొప్పున, ...........ముద్రలవలె చెక్కబడిన వారి పేళ్ల చొప్పున, ......,.... గోత్రముల పేళ్ళు ఒక్కొక్కదానిమీద ఒక్కొక్క పేరు చెక్కబడెను.?
A. పది
B. పండ్రెండు
C. రెండు
D. పైవేవి కావు
91/130
మరియు వారు ఆ పతకమునకు మేలిమి బంగారుతో అల్లికపనియైన .... చేసిరి.?
A. త్రాడు
B. త్రాడులు
C. గొలుసులు
D. గోడలు
92/130
మరియు వారు రెండు బంగారు ...... చేసి ఏపోదు నెదుటనున్న పతకపు లోపలి అంచున దాని రెండు కొనలకు వాటిని వేసిరి.?
A. కిరీటములు
B. గొలుసులు
C. ఉంగరములను
D. బల్లలను
93/130
అది ........కుండునట్లు దాని రంధ్రమునకు చుట్టు ఒక గోటు ఉండెను.?
A. చనర
B. చినుగ
C. పడ
D. కూర్చో
94/130
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ............ ఆ పని అంతయు చేసిరి.?
A. బసలేలు
B. అహరోను
C. ఇశ్రాయేలీయులు
D.పైవేవికావు
95/130
మరియు బెసలేలు తుమ్మకఱ్ఱతో ఆ ........చేసెను. దాని పొడుగు రెండు మూరలనర దాని వెడల్పు మూరెడునర దాని యెత్తు మూరెడునర.?
A. దూతను
B. మందసమును
C. కెరూబులను
D. ఆవరణం
96/130
లోపలను వెలుపలను దానికి మేలిమి .... రేకు పొదిగించి దానికి చుట్టు ..... జవను చేసెను.?
A. బంగారు
B. వెండి
C. యిత్తడి
D. రాగి
97/130
మందసమును .......దాని ప్రక్కలమీది ఉంగరములలో ఆ మోతకఱ్ఱలను చొనిపెను.?
A. లాగుటకు
B. మోయుటకు
C. లేపుటకు
D. దొబ్బుటకు
98/130
మరియు అతడు మేలిమి బంగారుతో ........... చేసెను. దాని పొడుగు రెండు మూరలనర దాని వెడల్పు మూరెడునర;?
A. కృపాసనం
B. బలిపీటము
C. సింహాసనం
D. కరుణాపీఠమును
99/130
మరియు రెండు బంగారు ....... చేసెను, కరుణాపీఠముయొక్క రెండు కొనలను వాటిని నకిషిపనిగా చేసెను. ?
A. సెరాపులు
B. కెరూబులను
C. దూతలు
D. ఆజ్ఞలు
100/130
ఆ కెరూబులు ........ రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను.?
A. కిందకివిప్పిన
B. తూర్పుకువిప్పిన
C. పైకివిప్పిన
D. పడమరకివిప్పిన
101/130
మరియు అతడు తుమ్మకఱ్ఱతో ..... చేసెను. దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు మూరెడు దాని యెత్తు మూరెడునర.?
A. బల్లను
B. రాతిని
C. కుండను
D. పీటమును
102/130
దానికి చుట్టు బెత్తెడు ......చేసి దాని ......పైని చుట్టు బంగారు జవను చేసెను.?
A. బల
B. పీట
C. బదె
D. పైవేవి కావు
103/130
మరియు నతడు బల్లమీదనుండు దాని ఉపకరణములను, అనగా దాని ...............దాని ధూపకలశములను దాని గిన్నెలను తర్పణము చేయుటకు దాని పాత్రలనుమేలిమి బంగారుతో చేసెను.?
A. బంగాలము
B. ద్వీపము
C. గంగాళములను
D. ప్రదీపము
104/130
.....వృక్షమునుండి బయలుదేరు ఆరు కొమ్మలలో రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన మొగ్గయు నుండెను.?
A. దీప
B. ప్రదీప
C. లెబాను
D. బంగారు
105/130
దానిని దాని ఉపకరణములన్నిటిని ఎన్ని వీసెల మేలిమి బంగారుతో చేసెను.?
A. యాబది
B. నలుబది
C. ఇరువది
D. తొంబది
106/130
అతడు పరిశుద్ధమైన ...... తైలమును స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేళకునిచేత చేయించెను.?
A. పరిశుద్ధ
B. నీతి
C. అభిషేక
D. పైవేవికావు
107/130
అతడు ఆ ..... సంబంధమైన ఉపకరణములన్ని టిని, అనగా దాని బిందెలను దాని గరిటెలను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్ని పాత్రలను చేసెను.?
A. బలికి
B. మందసముకు
C. దూతకు
D. బలిపీఠ
108/130
ఆ బలిపీఠము నిమిత్తము దాని జవక్రింద దాని నడిమివరకు లోతుగానున్న వలవంటి ఇత్తడి .........చేసెను. ?
A. రేకును
B. జల్లెడను
C. పీఠము
D. వలను
109/130
ఆ మోతకఱ్ఱలను తుమ్మ కఱ్ఱతో చేసి వాటికి. రేకులు పొదిగించెను.?
A. ఇనుప
B. వెండి
C. రాగి
D. యిత్తడి
110/130
ఆ............ మోయుటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆమోతకఱ్ఱలు చొనిపెను; పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను.?
A. కృపాసనం
B. బలిపీటమును
C. సింహాసనం
D. కరుణాపీఠమును
111/130
అతడు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమున సేవింపవచ్చిన ......... అద్దములతో ఇత్తడి గంగాళ మును దాని ఇత్తడి పీటను చేసెను. ?
A. సేవకుల
B. సేవకురాండ్ర
C. దూతలు
D. పులు
112/130
మరియు అతడు ............ చేసెను. కుడివైపున, అనగా దక్షిణ దిక్కున నూరు మూరల పొడుగు గలవియు పేనినసన్ననారవియునైన తెరలుండెను.?
A. ఆవరణము
B. దేవాలయం
C. అడ్డతెర
D. పీఠమును
113/130
ఆవరణము చుట్టునున్నదాని .........పేనిన సన్ననారవి.?
A. కొలతలన్ని
B. తెరలన్నియు
C. పొదిగించిన
D. గోడలన్ని
114/130
దాని పొడుగు ఇరువది మూరలు; దాని యెత్తు, అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా, ..........మూరలు.?
A. నాలుగు
B. రెండు
C. అయిదు
D. పైవేవి కావు
115/130
వాటి స్తంభములు ......, వాటి ఇత్తడి దిమ్మలు..... వాటి వంకులు వెండివి.?
A. మూడు
B. ఎనమిది
C. అయిదు
D. నాలుగు
116/130
యూదా గోత్రికుడైన హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు యెహోవా .మోషేకు ......దంతయుచేసెను.?
A. ఆజ్ఞాపించిన
B. తాకిన
C. పలికిన
D. చూపిన
117/130
పరిశుద్ధస్థలవిషయమైన పని అంతటిలోను పని కొరకు వ్యయపరచబడిన బంగారమంతయు, అనగా ప్రతిష్ఠింప బడిన బంగారు పరిశుద్ధస్థలపు తులము చొప్పున. ......... తులములు.?
A. పదహారుమణుగుల ఐదువందల ముప్పది
B. నూట పదహారుమణుగుల రెండువందల ముప్పది
C. నూట పదహారుమణుగుల ఐదువందల ముప్పది
D. నూట పదహారుమణుగుల ఐదువందల
118/130
ఈ పన్ను .......... ఏండ్లు మొదలు కొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో, అనగా ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబది మందిలో తలకొకటికి అరతులము. ?
A. పదునెనమిది
B. ఇరువది
C. ముప్పది
D. పైవేవికావు
119/130
మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు .... నిలువబెట్టవలెను.?
A. మందిరమును
B. గుడారమును
C. గోడలను
D. బలిపీటమును
120/130
అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును ..... కప్పవలెను.?
A. రేకుతో
B. అడ్డతెరతో
C. జల్లెడతో
D. ఏఫోదుతో
121/130
నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసినవాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను....... ?
A. కాల్చవలెను
B. మండవలెను
C. శుద్ధిచేయవలెను
D. వెలిగింపవలెను
122/130
సాక్ష్యపు మందసము నెదుట ధూమము వేయు బంగారు ....... ఉంచి మందిర ద్వారమునకు తెరను తగి లింపవలెను. ?
A. పీటను
B. వేదికను
C. పాత్రను
D. పచ్చలను
123/130
ప్రత్యక్షపు గుడారపు మందిరద్వారము నెదుట .... బలిపీఠమును ఉంచవలెను;?
A. దహన
B. బంగారు
C. వెండి
D. యిత్తడి
124/130
ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్యను గంగాళమును ఉంచి దానిలో. ....... నింపవలెను.?
A. నిప్పు
B. సాంబ్రానితొ
C. నీళు
D. ఆత్మతో
125/130
మరియు నీవు ........ తీసికొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును.?
A. తైలము
B. అభిషేక తైలమును
C. నూనెను
D. నీళ్లను
126/130
దహన బలిపీఠమునకు అభిషేకముచేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను, అప్పుడు ఆ పీఠము ....... మగును.?
A. అతిపరిశుద్ధ
B. పరిశుద్ధ
C. అపవిత్ర
D. పైవేవి కావు
127/130
అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకముచేసి అతని ..........?
A. పంపవలెను
B. దీవించవలెను
C. పరిశుద్ధపరచవలెను
D. ప్రతిష్ఠింపవలెను
128/130
వారి అభిషేకము తరతరములకు వారికి .........యాజకత్వ సూచనగా ఉండుననెను.?
A. విలువైన
B. పవిత్రమైన
C. నిత్యమైన
D. ఒక
129/130
రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున ..... నిలువబెట్టబడెను. ?
A. యాజకులు
B. మందిరము
C. మందసము
D. కరుణాపీఠము
130/130
మేఘము మందిరముమీదనుండి పైకి వెళ్లునప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ..........పోయిరి.
A. ప్రార్థించి
B. ప్రయాణమై
C. నిలిచిపోయిరి
D. పైవేవికావు
Result:

Popular Posts

Bible Quiz From Genesis Questions and Answers

 Genesis Quiz: 100 Questions on  Genesis 100 Bible Quiz Questions and Answers​  From the Book of Genesis (Part 1) Genesis Bible Quiz 1/100 ఆదికాండములో మొత్తం ఎన్ని అద్యాయాలున్నాయి? A. 50 B. 40 C. 60 D. 30 2/100 దేవుడు మనిషిని ఎన్నవ దినమున సృజించాడు? A. మొదటి దినమున B. ఐదవ దినమున C. ఆరవ దినమున D. ఏడవ దినమున 3/100 దేవుడు వెలుగునకు__పేరు పెట్టెను? A. సూర్యుడని B. రాత్రిఅని C. కాంతి D. పగలని 4/100 ఏదెనులోనుండి ఒక నది బయలు దేరి అక్కడనుండి చీలిపోయి ఎన్ని శాఖలాయెను.? A. మూడు B. నాలుగు C. రెండు D. ఐదు 5/100 గీహోను నది ఏ దేశము చుట్టు పారుచున్నది? A. కూష B. అష్షూరు C. హవీల D. నారు 6/100 అష్షూరు తూర్పు వైపు పారుచున్న నది పేరు ఏమిటి? A. పీషోను B. గీహోను C. యూఫ్రటీసు D. హిద్దెకెలు 7/100 దేవుడైన యెహోవా___ న ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను? A. తూర్పున B. దక్షిణమున C. పడమర D. ఉత్తరమున 8/100 ఏ దేశపు బంగారము శ్రేష్టమైనది? A.షినారు B. హవీల C.అష్షూరు D. కూషు 9/100 ఆదికాండము గ్రంధకర్త ఎవరు? A. సమూయేలు B. యెహోషువా C.మోషే D. యిర్మియా 10/100 దేవుడు ఏ దినమును

Bible Quiz From Matthew Questions and Answers

 Matthew Quiz: 100 Questions on The Gospel According to Matthew 100 Bible Quiz Questions and Answers​  From the Book of Matthew (Part 1) Matthew Bible Quiz 1➤ మత్తయి సువార్త వ్రాసింది ఎవరు? A. మత్తయి B. మార్కు C. లూకా D. యోహాను 2➤ మత్తయికి ఉన్న మరొక పేరు ఏమిటీ? A. సీమోను B. లేవి C. తద్దయి D. లెబ్బయి 3➤ మత్తయి సువార్తలో మొత్తం అధ్యయాలు ఎన్ని? A. 25 B. 26 C. 27 D. 28 4➤ యేసుక్రీస్తు ఏ వంశములో జన్మించాడు? A. ఎదోము వంశములో B. దావీదు వంశములో C. లేవీయుల వంశములో D. కహాతీయుల వంశములో 5➤ అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరములు? A. పన్నెండు తరములు B. పదమూడు తరములు C. పదునాలుగు తరములు D. పదిహేను తరములు 6➤ దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమువరకు ఎన్ని తరములు? A. పదమూడు తరములు B. పదునాలుగు తరములు C. పదిహేను తరములు D. పదహారు తరములు 7➤ యూదులు బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు ఎన్ని తరములు? A. పదునాలుగు తరములు B. పదిహేను తరములు C. పదహారు తరములు D. పదిహేడు తరములు 8➤ మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారే కము కాకమునుపు ఆమె ----